ఘనంగా వీహెచ్‌పీ శౌర్యయాత్ర
సిరిసిల్లటౌన్: విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం సిరిసిల్లలో త్రిశూల్‌దీక్ష, శౌర్యయాత్ర నిర్వహించారు. వందలాది సంఖ్యలో భజరంగ్‌దళ్ సభ్యులు పాల్గొనగా..పట్టణంలో ప్రధాన వీధుల్లో శోభాయాత్ర జరిగింది. వీహెచ్‌పీ తెలంగాణ కన్వీనర్ శివరాములు, జిల్లా అధ్యక్షుడు చేపూరి అశోక్, పట్టణాధ్యక్షుడు గుంటుకు పురుషోత్తం, భజరంగ్‌దళ్ పట్టణాధ్యక్షుడు బండారి సంతోష్, ఉపాధ్యక్షుడు కొమిరె గౌతమ్, రాయిన హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
అలరించిన చిన్నారుల శ్లోక పఠనం
సిరిసిల్లకల్చరల్/సిరిసిల్లటౌన్: చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలవిహార్ ఆహుతులను అలరించింది. చిన్నారుల శ్లోకపఠనం ఆకట్టుకుంది. స్థానిక బీవైనగర్‌లోని శ్రీభక్తాంజనేయ ఆలయంలో ఆదివారం జరిగిన కార్యక్రమానికి మున్సిపల్ వైస్‌చైర్మన్ మంచె శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. అనంతరం తన తండ్రి భూమయ్య జ్ఞాపకార్థం చిన్నారులకు భగవద్గీత పుస్తకాలు అందజేశారు. చిన్మయ మిషన్ జిల్లా శాఖ అధ్యక్ష, కార్యదర్శులు సజ్జనం శ్రీనివాస్, నల్ల సత్యనారాయణ, లకావత్ మోతీలాల్‌నాయక్, మేరుగు మల్లేశం, చంద్రప్రకాశ్, జక్కని రమేశ్, రాజమణి పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పర్శరాములు
వేములవాడఅర్బన్: జాతీయ బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వేములవాడ మండలం సంకెపల్లికి చెందిన రెడ్డవేణి పర్శరాం నియమితులయ్యారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆదివారం నియామకపత్రం అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment