సాగుకు యోగ్యం లేనివి తొలగించాలి
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ● సర్వే ఆకస్మిక తనిఖీ
ఎల్లారెడ్డిపేట/వీర్నపల్లి/కోనరావుపేట/గంభీ రావుపేట: వ్యవసాయ యోగ్యం కాని భూములను క్షేత్ర స్థాయిలో గుర్తించి తొలగించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతుభరోసా పథకాలు, రేషన్ కార్డుల జారీ కోసం కోనరావుపేట మండలం మర్రిమడ్ల, వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలం నర్మాల, గోరంటాలలో సర్వేను ఆదివారం పరిశీలించారు. ఆయా గ్రామాల్లో సర్వే కొనసాగుతుండగా కలెక్టర్ రికార్డులు పరిశీలించారు. రైతు భరోసా పథకం సాగుచేసే రైతులందరికీ అందుతుందని స్పష్టం చేశారు. వ్యవసాయ యోగ్యంకాని భూములను తొలగించాలని సూచించారు. రేషన్‌కార్డుల కోసం పలువురు కలెక్టర్‌ను కోరగా.. త్వరలోనే ఇస్తామని తెలిపారు. ఇది నిరంతర ప్రక్రియ అని, ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు.
విద్యాలయం ఆకస్మిక తనిఖీ
మర్రిమడ్లలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌ను కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల తరగతి గదులు, హాస్టల్ భవనం, డైనింగ్‌హాల్, కిచెన్, స్టోర్‌రూమ్ పరిసరాలు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కామన్ మెనూ అమలుపై ఆరా తీశారు. ప్రహరీ పూర్తిగా నిర్మించాలని, బోర్‌వెల్ వేయించాలని కలెక్టర్‌కు ఆ విద్యాలయం ప్రిన్సిపాల్ విన్నవించారు. ప్రహరీ, బోర్‌వెల్ ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించాలని కోనరావుపేట ఎంపీడీవోను కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి రాందాస్, తహసీల్దార్లు, ఎంపీడీవోలు విజయ్‌ప్రకాశ్‌రావు, మారుతిరెడ్డి, రాంచందర్, భూపతి, శంకర్‌రెడ్డి, వాజిద్, సత్తయ్య, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment