అర్హులకు పథకాలు అందేలా చూడాలి
● గుర్తింపు సర్వే పక్కాగా నిర్వహించాలి ● వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
సిరిసిల్ల: అర్హులకు పథకాలు అందించాలని, సర్వే పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి ఆదివారం ఆర్డీవోలు, మండల ప్రత్యేకాధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, వ్యవసాయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. రేషన్‌కార్డుల జారీప్రక్రియ నిరంతరం కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఇప్పటికీ కార్డు లేని వారు కొత్తగా దరఖాస్తు అందజేయాలని సూచించారు. అర్హులకు రేషన్‌కార్డులు జారీ చేస్తామని తెలిపారు. కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేస్తారని వివరించారు. ఈ అంశాలపై ఎలాంటి అపోహలు అవసరం లేదని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇండ్లు అర్హులందరికీ అందజేస్తామని తెలిపారు. దరఖాస్తు చేసుకోని వారు ఉంటే అర్జీలు ఇవ్వాలన్నారు.
వ్యవసాయ యోగ్యం కాని భూములు గుర్తించాలి
జిల్లాలో వ్యవసాయ యోగ్యం కాని భూములను గుర్తించాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సాగుచేసే రైతులందరికీ రైతుభరోసా అందుతుందని పేర్కొన్నారు. జిల్లాలో వ్యవసాయ యోగ్యం కాని భూములను రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులు సమన్వయంతో సర్వేచేసి గుర్తించాలని మిగతా శాఖ అధికారుల నుంచి సమాచా రం తీసుకుని భూములను పక్కాగా గుర్తించాలని ఆదేశించారు. వ్యవసాయ శాఖ అధికారుల వద్ద పంట సాగు వివరాలు, తహసీల్దార్ల వద్ద నాలా భూముల కన్వర్షన్ వివరాలు పరిశీలించాలని తెలి పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, డీఆర్డీవో శేషాద్రి, సీపీవో శ్రీని వాసాచారి, జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్ బేగం, ఎస్‌డీసీ రాధాభాయ్, జిల్లా పౌరసరఫరాల అధి కారి వసంతలక్ష్మి, ఏడీ మైన్స్ క్రాంతికుమార్, ము న్సిపల్ కమిషనర్లు లావణ్య, అన్వేశ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment