గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చేయండి
● అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్
సిరిసిల్ల: జిల్లా కేంద్రంలో నిర్వహించే గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం వేడుకల నిర్వహణపై జిల్లా అధికారులతో సమీక్షించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వేడుకలను జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలోని పరేడ్‌గ్రౌండ్‌లో నిర్వహించేందుకు గ్రౌండ్‌ను, డయాస్‌ను సిద్ధం చేయాలని సూచించారు. అతిథులకు, అధికారులకు ప్రొటోకాల్ ప్రకారం సీటింగ్ ఏర్పాటు చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. స్టాళ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. వేడుకలకు హాజరయ్యే వారికి తాగునీటి వసతి, సాంస్కృతిక కార్యక్రమలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇప్పటి వరకు ప్రశంసాపత్రాలు పొందని ఉత్తమ సేవలందించిన ప్రభుత్వ ఉద్యోగులను ఎంపిక చేసి ఈనెల 24లోగా ప్రతిపాదనలు పంపించాలని అధికారులను ఆదేశించారు. అదనపు ఎస్పీ చంద్రయ్య, సిరిసిల్ల ఆర్డీవో వెంకట ఉపేందర్‌రెడ్డి, జిల్లా వైద్యాధికారి రజిత, డీపీఆర్‌వో వంగరి శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ లావణ్య, డీఈవో జగన్మోహన్‌రెడ్డి, సిరిసిల్ల తహసీల్దార్ ఉమారాణి, కలెక్టరేట్ ఏవో రామ్‌రెడ్డి, చేనేత, జౌళిశాఖ ఏడీ సాగర్, ఏఆర్ ఆర్‌ఐలు మధుకర్, రమేశ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment