ప్రత్యేక కేసుగా విచారణ చేపట్టండి
శంకర్‌పల్లి: పట్టణంలో ఆదివారం రాత్రి మున్సిపల్ కౌన్సిలర్ రాధా బాలకృష్ణ ఇంట్లో బంగారం చోరీ ఘటనను ప్రత్యేక కేసుగా పరిగణించి, దొంగలను పట్టుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్‌ని ఫోన్‌లో కోరారు. మంగళవారం ఆమె బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. మరో రెండు రోజుల్లో కూతురు వివాహం ఉండగా.. ఇలా జరగడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కేసును త్వరగా ఛేదించి పోయిన సొత్తును రికవరీ చేసి అప్పగిస్తారని కౌన్సిలర్ కుటుంబసభ్యులకు భరోసా కల్పించారు. పోలీసులు దుండగులను పట్టుకుని కఠినంగా శిక్షించాలన్నారు. సబితారెడ్డి వెంట శంకర్‌పల్లి పీఏసీఎస్ చైర్మన్ శశిధర్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకట్‌రాంరెడ్డి, బీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి, నాయకులు నారాయణ, విఠలయ్య, దండు రాజేశ్వర్, ప్రవీణ్‌కుమార్, మహేందర్‌రెడ్డి, ఉపేందర్‌రెడ్డి, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
మాజీ మంత్రి సబితారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment