బీసీల అభ్యున్నతికి కృషి
షాద్‌నగర్‌రూరల్: బీసీల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని బీసీ మహాసభ జిల్లా అధ్యక్షుడు క్యూసెట్ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం పట్టణంలోని రాఘవేంద్ర కాలనీ వాసులు ఆయన్ను ఘనంగా సన్మానించారు. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ.. బీసీలు ఆర్థిక, రాజకీయ, విద్య, ఉద్యోగ, సామాజిక రంగాల్లో వెనుకబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా బీసీలు అధికంగా ఉన్నప్పటికీ వారికి రావాల్సిన రిజర్వేషన్లు అందడంలేదన్నారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లను కల్పించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీసీల సంక్షేమం, అభివృద్ధికి చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీసీ మహాసభ రాష్ట్ర ప్రధానకార్యదర్శి మానపాటి ప్రదీప్ కుమార్, నాయకులు వినోద్‌కుమార్‌గౌడ్, నర్సింలు, యాదయ్య, కాశన్న, రఘునందన్‌రెడ్డి, మదన్మోహన్, వెంకటేశ్, ట్యాంకర్ నర్సింహ, రవి, గుడ్డు యాదవ్, మహేశ్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
బీసీ మహాసభ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్
Comments
Please login to add a commentAdd a comment