బీసీలకు రిజర్వేషన్లు పెంచాలి
తుర్కయంజాల్: స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను పెంచాలని బీసీ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు రావులకోలు నరేశ్ ప్రజాపతి డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ భూసాని వెంకటేశ్వర రావును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నరేశ్ మాట్లాడుతూ.. బీసీలకు అన్ని రంగాల్లో అన్యాయమే జరుగుతుందని, 55 శాతంకు పైగా ఉన్నప్పటికీ, 18 శాతం రిజర్వేషన్లను కల్పిస్తున్నారన్నారు. విద్యా, ఉద్యోగ అవకాశాల్లో కూడా జనాభాకు తగిన రీతిలో రిజర్వేషన్లను కల్పించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్‌ల చెప్పినట్లుగా 42 శాతం రిజర్వేషన్‌లను పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్ ముదిరాజ్, శ్రీనివాస్ గౌడ్, నరసింహానాయక్, చందు తదితరులు పాల్గొన్నారు.
బీసీ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు నరేశ్ ప్రజాపతి
Comments
Please login to add a commentAdd a comment