కేంద్రం విధానాలపై రాజీలేని పోరు | - | Sakshi
Sakshi News home page

కేంద్రం విధానాలపై రాజీలేని పోరు

Published Thu, Nov 21 2024 8:09 AM | Last Updated on Thu, Nov 21 2024 8:09 AM

కేంద్రం విధానాలపై రాజీలేని పోరు

కేంద్రం విధానాలపై రాజీలేని పోరు

యాచారం: కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటం చేయాల్సిన అవసరం ఉందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పి.అంజయ్య అన్నారు. కార్మిక, రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఈ నెల 26న ఇందిరాపార్క్‌ వద్ద ధర్నా చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి బుధవారం మండల పరిధిలోని కుర్మిద్ద గ్రామంలో కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంజయ్య మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి రైతులకు, కార్మికులకు, పేదలకు తీవ్ర అన్యాయం చేస్తోందని ఆరోపించారు. పేదలకు అన్యాయం చేస్తూ పారిశ్రామికవేత్తలకు వత్తాసు పలుకుతోందన్నారు. ధర్నాకు ప్రజలు పెద్ద ఎత్తున రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు సురేశ్‌, మల్లయ్య, చెన్నయ్య, కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు అంజయ్య

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement