కందుకూరు: మీర్‌ఖాన్‌పేట రెవెన్యూ ఫ్యూచర్ సిటీ సమీపంలో కొనసాగుతున్న స్టోన్ క్రషర్లను బుధవారం మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సురేంద్రమోహన్ సందర్శించారు. అక్కడ చేపట్టిన తవ్వకాలను, క్రషర్ పనులను పర్యవేక్షించారు. ఎంత విస్తీర్ణంలో మైనింగ్ జరుగుతుంది..? డంపింగ్‌కు ఉపయోగిస్తున్న విస్తీర్ణం ఎంత అనేది సర్వే చేసి చెప్పాలని మైనింగ్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం మైనింగ్ జరుగుతున్న భూములు టీజీఐఐసీ పరిధిలో ఉన్నాయి. అప్పటి ప్రభుత్వం అవసరమైనప్పుడు తిరిగి టీజీఐఐసీకి అప్పగించే ప్రాతిపదికన మైనింగ్‌కు అనుమలిచ్చింది. ఈ పరిశీలనలో ప్రిన్సిపల్ సెక్రటరీ వెంట టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్‌రెడ్డి, తహసీల్దార్ గోపాల్, ఆర్‌ఐ యాదయ్య, రెవెన్యూ, మైనింగ్ అధికారులు, సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment