భార్య పుట్టింటికి వెళ్లి రాలేదని..
ఉరేసుకొని భర్త ఆత్మహత్య
తాండూరు రూరల్: పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి రాక పోవడంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండలంలోని చెంగోల్ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. కరన్‌కోట్ ఎస్‌ఐ విఠల్‌రెడ్డి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నర్సగాళ్ల రమేశ్(33) కూలీ పనులు చేసుకుంటు జీవిస్తున్నాడు. ఆయనకు 12 ఏళ్ల క్రితం కర్ణాటక రాష్ట్రం మిర్యాణ్‌కు చెందిన అనితతో వివాహమైంది. వీరికి పదేళ్ల కుమారుడు ఉన్నారు. కొన్నేళ్లుగా దంపతుల మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. దీంతో నాలుగేళ్ల నుంచి అనిత పుట్టింటిలో ఉంటుంది. దీంతో రమేశ్ మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో ఆయన ఆదివారం సాయంత్రం చెంగోల్ గ్రామంలోని తన ఇంటిలో దులానికి చీరతో ఉరేసుకున్నాడు. తల్లి అనంతమ్మ చూసి స్థానికులకు చెప్పడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
హిట్ అండ్ రన్ కేసులో నిందితుడి అరెస్టు
పంజగుట్ట: హిట్ అండ్ రన్ కేసులో నిందితుడిని పంజగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. విద్యానగర్‌కు చెందిన పున్నం లోకేష్ (21) బాచుపల్లిలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం అతను స్నేహితుడితో కలిసి బైక్‌పై కాలేజీకి వెళుతుండగా అమీర్‌పేట బిగ్‌బజార్ వద్ద వెనక నుంచి వేగంగా వచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ కొనడంతో లోకేష్ అక్కడిక్కడే మృతి చెందాడు. సీసీ కెమెరాల ఆధారంగా ప్రమాదానికి కారణమైన బస్సును గుర్తించారు. గో టు ట్రావెల్స్‌కు చెందిన బస్సును ప్రమాద సమయంలో డ్రైవర్ ఓంప్రకాష్ నడుపుతున్నట్లు గుర్తించారు. శనివారం రాత్రి అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బస్సును సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కోడిపందేల స్థావరంపై దాడి..
జీడిమెట్ల: కోడిపందేల స్థావరంపై దాడి చేసిన జీడిమెట్ల పోలీసులు 11మందిని అరెస్ట్ చేశారు. ఇన్‌స్పెక్టర్ గడ్డం మల్లేష్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆదివారం ఉదయం కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్ సమీపంలో కొందరు వ్యక్తులు కోడి పందేలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కోడిపందేలు ఆడుతున్న 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.15,440 నగదు 9 సెల్‌ఫోన్‌లు, 16 కత్తులు, ఆరు పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
యథేచ్ఛగా చెట్ల నరికివేత
దుద్యాల్: అక్రమార్కులు కలపపై కన్నేసి విచ్చ ల విడిగా చెట్లను నరుకుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. మండల పరిధిలోని ఆలేడ్, హస్నాబాద్, గౌరారం, లగచర్ల గ్రామా ల్లో ఆదివారం అక్రమార్కులు విచ్చల విడిగా చెట్లను నరుకుతున్నారు. ఎక్కడిక్కడ ఇష్టానుసారంగా కలప డంపులు ఏర్పాటు చేస్తున్నా అటవీ శాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అధికారుల అండదండలతో కలప వ్యాపారులు రెచ్చిపోతున్నా రు. దుద్యాల్ మండలంలో నిత్యం కలపను తరలిస్తున్నారని ఆయా గ్రామాలకు చెంది పలువురు వాపోయారు. మండలంలో పెద్ద ఎ త్తున చెట్లను నరుకుతూ అక్రమ రవాణాకు పా ల్పడుతున్నారు. పర్యవేక్షించాల్సినా అధికా రు లు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ప్రకృతి ప్రేమికులు వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment