పోరాటాల ఘనత సీపీఐదే
పార్టీ జిల్లా కార్యదర్శి పాల్మాకుల జంగయ్య
షాద్‌నగర్: కమ్యూనిస్టు పార్టీ చరిత్ర గురించి నాయకులు, కార్యకర్తలు ప్రజలందరికీ వివరించాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పాల్మాకుల జంగయ్య అన్నారు. పార్టీ ఏర్పడి వంద వసంతాలు అవుతున్న సందర్భంగా చేవెళ్ల, ఎల్బీనగర్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభలకు సంబంధించిన వాల్‌పోస్టర్లను ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పాల్మాకుల జంగయ్య మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం సీపీఐ ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు చేయడం జరిగిందని అన్నారు. నిరుపేదలకు అండగా ఉంటూ ప్రభుత్వాలపై ఒత్తిళ్లు తెచ్చి ఎన్నో సమస్యలు పరిష్కారమయ్యేలా కృషి చేసిందన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిందన్నారు. పార్టీ వందేళ్ల ఉత్సవం సందర్భంగా చేవెళ్ల, ఎల్బీనగర్‌లో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తోందని తెలిపారు. జిల్లా, మండల కేంద్రాల్లో సభలు, సమావేశాలు, ప్రదర్శనలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సమితి సభ్యుడు పానుగంటి పర్వతాలు, జిల్లా సమితి సభ్యుడు చందుయాదవ్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పవన్‌చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా నిర్వహించాలి
షాబాద్: సీపీఐ వందేళ్ల ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని పార్టీ జిల్లా కార్యదర్శి పాల్మాకుల జంగయ్య కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో ఆదివారం ఉత్సవాలకు సంబంధించిన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కె.రామస్వామి, మండల కార్యదర్శి నక్కలి జంగయ్య తదితరులు పాల్గొన్నారు.
ఆదర్శ పాఠశాలలో
ప్రవేశాలకు ఆహ్వానం
శంకర్‌పల్లి: తెలంగాణ ఆదర్శ పాఠశాలలో 2025–2026 సంవత్సరానికి గాను 6 నుంచి 10వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు శంకర్‌పల్లి ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ శోభారాణి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జనవరి 6వ తేదీ నుంచి
http://telanganams.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, ఫిబ్రవరి 28 దరఖాస్తుకు చివరి తేదీ అని తెలి పారు. ఆరో తరగతిలో నేరుగా ప్రవేశాలు ఉంటా యని, 7నుంచి 10వ తరగతుల్లో ఖాళీల భర్తీ ఉంటుందన్నారు. ప్రవేశాల కోసం ఓసీ లకు రూ.200, బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, ఈడబ్ల్యూఎస్ విద్యారులు రూ.125 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఏప్రిల్ 13న రాత పరీక్ష ఉంటుందని, ఏప్రిల్ 3 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు.
దర్గాను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే ‘పట్నం’
షాబాద్: మండల కేంద్రంలోని పహిల్వాన్‌షావలి దర్గాను ఆదివారం కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధికి ఎంతో కృషి చేసిందని గుర్తు చేశారు. దర్గా అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. ఆయన వెంట జెడ్పీటీసీ మాజీ సభ్యుడు జడల రాజేందర్‌గౌడ్, మతీన్, ఆయూబ్‌ఖాన్, ఆరీఫ్, మజీద్, ఇమ్రాన్, మునీర్, బాబషీర్, తౌసిప్ తదితరులు ఉన్నారు.
బీటీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయండి
కుల్కచర్ల: బీటీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ముజాహిద్‌పూర్ కాంగ్రెస్ నాయకులు షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ను కోరారు. ఆదివారం షాద్‌నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్లిన వారు చౌదర్‌గూడెం మండలం పెద్ద ఎల్కిచర్ల నుంచి మండల పరిధిలోని ముజాహిద్‌పూర్ వరకు బీటీ రోడ్డు లేక ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారని చెప్పారు. ఇప్పటికై నా స్పదించి రోడ్డు లేని గ్రామాలకు బీటీ రోడ్ల నిర్మాణం కోసం నిధులు మంజూరుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో షాద్‌నగర్ బ్లాక్ అధ్యక్షుడు జగదీశ్వర్, కాంగ్రెస్ చౌదర్‌గూడెం మండల అధ్యక్షుడు రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, వికారాబాద్ డీసీసీ కార్యదర్శి దేశ్‌ముఖ్ చంద్రభూపాల్, సీనియర్ నాయకులు శివకుమార్, రాములు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment