సంబరం
ధ్యానం..
రెండో రోజుకు చేరిన మహాయాగం
● హాజరైన సినీ స్టంట్ మాస్టర్స్ రామ్‌లక్ష్మణ్
● వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ధ్యానులు
కడ్తాల్: సాధనతో సాధించలేనిదంటూ ఏదీ లేదని ధ్యానగురువు పరిణిత పత్రి అన్నారు. మహేశ్వర మహాపిరమిడ్ ధ్యాన కేంద్రంలో కొనసాగుతున్న పత్రీజీ ధ్యాన మహాయాగం ఆదివారానికి రెండో రోజుకు చేరుకుంది. ఉదయం 5 నుంచి 8 గంటల వరకు సంజయ్ కింగి ఆధ్వర్యంలో ప్రాతఃకాల సంగీత ధ్యానం నిర్వహించారు. అనంతరం ధ్యానులను ఉద్దేశించి పరిణిత పత్రి మాట్లాడారు. నిరంతరం నేర్చుకోవాలనే తపన ఉండాలని, దానికి సాధనే మార్గమన్నారు. ధ్యాన యజ్ఞం నిరంతరం కొనసాగా లని ఆకాంక్షించారు. ధ్యానాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రతి ఒక్కరికీ ధ్యానం నేర్పుతూ పత్రీజీ సంకల్పాన్ని నెరవేర్చాలని కోరారు. ప్రపంచాన్ని ధ్యానమయం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సినీ స్టంట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా దాని లోని సూక్ష్మాన్ని గ్రహించి సత్యం తెలుసుకోవా లని సూచించారు. ప్రతి ఒక్కరూ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలని, ఆత్మ జ్ఞానం తెలుసుకున్న వారే ధ్యానులన్నారు. అనంతరం సుభాష్‌పత్రీజీ, స్వర్ణమాల పత్రీజీల వీడియో సందేశం ధ్యానులకు అందించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు గురువులు ఆధ్యాత్మిక, ధ్యాన సందేశం వినిపించారు. ఆదివారం కావడంతో వేడుకలకు తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన ధ్యానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో పిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి, ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
పత్రీజీ మార్గంలో నడవాలి
ఏ జీవినీ చంపి తినే హక్కు ఎవరికీ లేదని బీఏపీఎస్ స్వామి నారాయణ్ అక్షర్‌ధామ్ మందిర్ పూజ్య జ్ఞాన వత్సల్ స్వామీజీ అన్నారు. ఆది వారం మహేశ్వర మహాపిరమిడ్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ధ్యానులను ఉద్దేశించి మాట్లాడారు. ధ్యాన గురువు పత్రీజీ చూపిన ధ్యాన మార్గంలో నడవాలని సూచించారు. పిరమిడ్ మాస్టర్లను కలవడం చాలా సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. ఇంతటి గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తున్న పిరమిడ్ నిర్వాహకులను అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment