చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి
షాబాద్: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని మహాత్మా జ్యోతిపూలే గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శివరంజిని పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి సీఎం కప్–2024 కబడ్డీ పోటీల్లో మండలంలోని గురుకుల పాఠశాల విద్యార్థినులు విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యమేనన్నారు. క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీసేందుకే ప్రభుత్వం సీఎం కప్ క్రీడాపోటీలు నిర్వహించిందన్నారు. కార్యక్రమంలో ఫరూఖ్‌నగర్ మండల ఇన్‌చార్జి రాజశేఖర్‌రెడ్డి, పీడీ బాలయ్య, పీఈటీ రేణుక, మండల చైర్మన్, ఎంపీడీఓ, ఎంఈఓ, పీడీలకు, పీఈటీలు తదితరులు ఉన్నారు.
సీఎం కప్ పోటీల్లో మెరిసిన యువకుడు
శంకర్‌పల్లి: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీఎం కప్–2024 జిల్లా స్థాయి పోటీల్లో శంకర్‌పల్లి మండలం కొండకల్ గ్రామానికి చెందిన వరుణ్ గౌడ్(16) సత్తా చాటాడు. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన షాట్‌ఫుట్, డిస్క్‌త్రో విభాగాల్లో ప్రథమంగా నిలిచి తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ సెక్రటరీ మల్లారెడ్డి చేతుల మీదుగా బంగారు పతకం అందుకున్నాడు. కొండకల్ గ్రామానికి చెందిన లక్ష్మణ్ గౌడ్, కల్పన దంపతుల చిన్న కుమారుడు వరుణ్ గౌడ్. ఈ యువకుడు ప్రస్తుతం బాసరా ఐఐఐటీలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. కుమారుడు జిల్లా స్థాయిలో బంగారు పతకం సాధించడం పట్ల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి పతకాలు మరెన్నో సాధించాలని ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment