చెత్త నిర్మూలనకు సరికొత్త ప్రయోగం!
రాజేంద్రనగర్: ఓపెన్ పాయింట్లు, బహిరంగ ప్రదేశాల్లో ఇష్టారాజ్యంగా చెత్త వేయకుండా జీహెచ్‌ఎంసీ రాజేంద్రనగర్ సర్కిల్ అధికారులు సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఓపెన్ పాయింట్ల వద్ద గతంలో శుభ్రపరిచి రంగు రంగుల ముగ్గులు వేసి చెత్త వేయవద్దంటూ ప్రచారం చేశారు. ఇది విజయవంతమైంది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ చెత్త ఇతర వ్యర్థాలను వేస్తుండటంతో రేయింబవళ్లు కాపలాగా అక్కడే వాచ్‌మెన్ నియమించి చేసి చెత్త వేయకుండా అడ్డుకుంటున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రధాన ఓపెన్ పాయింట్ల వద్ద సిబ్బందిని నియమిస్తున్నారు. చెత్త వేసే వారిని సిబ్బంది అడ్డుకుంటున్నారు. వారి ఫొటోలను సైతం తమ సెల్‌ఫోన్లలో పంపిస్తుండటంతో ఓపెన్ పాయింట్ల వద్ద చెత్తను వేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.
– సర్కిల్ పరిధిలోని రాజేంద్రనగర్, మైలార్‌దేవ్‌పల్లి, అత్తాపూర్, సులేమాన్‌నగర్, శాస్త్రీపురం డివిజన్ల పరిధిలో దాదాపు 60 ఓపెన్ పాయింట్లను గుర్తించారు. ఈ పాయింట్ల వద్ద రోజే వాహనాలపై వెళ్లేవారు. స్థానికులు, దుకాణాల నిర్వాహకులు చెత్తను ఇష్టారాజ్యంగా వేసేస్తున్నారు. వీరికి ఒక్క పక్క కౌన్సిలింగ్ ఇస్తూనే ఆయా ప్రాంతాల్లో చెత్త వేయకుండా అడ్డుకునేందుకు వాచ్‌మెన్‌లను ఏర్పాటు చేశారు. దీంతో ఓపెన్ పాయింట్ల చెత్త వేయడం దాదాపు తగ్గిందని అధికారులు, సిబ్బంది వెల్లడిస్తున్నారు.
శుభ్రత పాటించండి...
బహిరంగ ప్రదేశాలు, రోడ్డుకు ఇరువైపులా చెత్త వేయరాదని రాజేంద్రనగర్ సర్కిల్ ఉప కమిషనర్ రవి కుమార్ కోరారు. ఓపెన్ పాయింట్లలో ఇప్పటికే వాచ్‌మెన్‌లను నియమించాన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఈ వాచ్‌మెన్ ఏర్పాటు ద్వారా చెత్త డంపింగ్‌లను నిర్మూలించామన్నారు. మరికొన్ని ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో చెత్తను వేస్తున్నారని తెలిపా. వారిని గుర్తించి అపరాధ రుసుము విధిస్తామన్నారు. తమ ఇంటి వద్దకు వచ్చే చెత్త సేకరణదారులకు చెత్తను అందించాలని ఆయన కోరారు.
వేయకుండా చూసేందుకు సిబ్బంది నియామకం
ప్రజల్లో చైతన్యం కల్పించే దిశగా ఏర్పాట్లు
అయినా వేస్తే జరిమానా తథ్యం
సత్ఫలితాలిస్తున్న అధికారుల చర్యలు
Comments
Please login to add a commentAdd a comment