బండ్లగూడ: మున్సిపల్ కార్మికులకు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సీఐటీయూ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు జాజాల రుద్రకుమార్ డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధన కోసం బండ్లగూడ జాగీర్ చౌరస్తాలో ఆదివారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ చౌరస్తాలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సీఐటీయూ గండిపేట మండల కన్వీనర్ డప్పు ప్రవీణ్‌కుమార్, మున్సిపల్ విభాగం జిల్లా అధ్యక్షుడు యాదగిరి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి రుద్రకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రుద్రకుమార్ మాట్లాడుతూ... రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయినా మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించకపోవడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో సుమారు 65 వేల మంది కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, ఎన్‌ఎంఆర్ ఫిక్ట్స్ పే డైలీ వేజెస్ తదితర పద్ధతుల్లో పని చేస్తున్నాన్నారు. సిబ్బందికి పర్మినెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి ప్రభుత్వ సంక్షేమాలు అమలు కావడం లేదన్నారు. పని చేస్తున్న సమయంలో మరణిస్తున్నారని వాపోయారు. రెండవ పీఆర్‌సీలో కనీస వేతం రూ. 26 వేల ప్రకారం చెల్లించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికులకు 8 గంటల పని దినాన్ని అమలు చేయాలన్నారు. కార్మికులకు రూ. 10 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలన్నారు. పీఎఫ్, ఈఎస్‌ఐ డబ్బులను కార్మికుల ఖాతాల్లో చేయడం లేదన్నారు. జమ చేయని మున్సిపల్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ జవాన్లు సురేష్, జగన్, సుభాష్, రామాంజనేయులు, నవీన్, నరేందర్, రాము, లక్ష్మీనారాయణ, కార్మికులు భారతమ్మ, అంజమ్మ, పార్వతమ్మ, స్వరూప, సావిత్రి తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చినహామీలు తక్షణమే అమలు చేయాలి
Comments
Please login to add a commentAdd a comment