ముగిసిన ‘బ్రిగ్‌కాన్–2024’ సదస్సు
అబ్దుల్లాపూర్‌మెట్: మండల కేంద్రంలోని బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ ఎడ్యుకేషనల్ సొసైటీ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూట్ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్‌లో అసోసియేషన్ ఆఫ్ ఫార్మాసుటికల్ టీచర్స్ ఆఫ్ ఇండియన్(ఏపీటీఐ) ఆధ్వర్యంలో బ్రిగ్‌కాన్–2024 పేరుతో రెండు రోజుల పాటు నిర్వహించిన జాతీయ స్థాయి అవగాహన సదస్సు ఆదివారంతో ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏపీటీఐ సెంట్రల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ వీరారెడ్డి ప్రభాకర్‌రెడ్డి హాజరై మాట్లాడుతూ.. ఫార్మారంగంలోని పరిశోధనలకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. విద్యార్థులు పరిశోధనలపై దృష్టి సారించాలని అకాడమిక్ డైరెక్టర్ రఘోత్తంరెడ్డి సూచించారు. కార్యక్రమంలో అసోసియేషన్ ఫార్మాసూటికల్ టీచర్స్ ఆఫ్ ఇండియా సౌత్ రీజియన్ ప్రెసిడెంట్ డాక్టర్ కృష్ణమోహన్ చిన్నాల, రఘునందన్, రమేష్, కళాశాల డైరెక్టర్స్ నరేంద్రకుమార్, పెన్లన్‌పాల్దాస్, ప్రిన్సిపాల్ డాక్టర్ కంట్లమ్, ఏఓ రవీందర్‌రెడ్డిలతో పాటు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment