తీపి
సోమవారం శ్రీ 23 శ్రీ డిసెంబర్ శ్రీ 2024
చేదును పంచుతున్న
ఆందోళన కలిగిస్తున్న మధుమేహం
● రోజురోజుకూ పెరుగుతున్న బాధితులు
● జిల్లాలో 13,75,409 మందికి పరీక్షలు
● 47,592 మందికి వ్యాధి ఉన్నట్లు గుర్తింపు
● మారిన జీవనశైలే కారణం అంటున్న వైద్య నిపుణులు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: మధుమేహం చాపకిందనీరులా విస్తరిస్తోంది.. జిల్లాలో రోజురోజుకూ బాధితుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. వారసత్వంగా కొంత మంది, జీవనశైలి మార్పుతో మరికొంత మంది ఈ వ్యాధి బారినపడుతున్నారు. సాధారణంగా 60 ఏళ్ల పైబడిన వారిలో వెలుగు చూసే వ్యాధి ప్రస్తుతం పాతికేళ్లలోపు వారిలోనే వెలుగు చూస్తోంది. నేషనల్ పోగ్రాం ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్(ఎన్‌సీడీ) ఇటీవల విడుదల చేసిన డేటాను పరిశీలిస్తే ఇదే స్పష్టమవుతోంది. నిద్రలేమి, పని ఒత్తిడికి తోడు ఫాస్ట్‌ఫుడ్ కల్చర్ పెరిగిపోవడం.. శరీరానికి కనీస వ్యాయామం లేకపోవడం.. పీకల దాక మ ద్యం తాగడం.. అర్ధరాత్రి పొద్దుపోయిన తర్వాత బిర్యానీలు ఆరగించడం వంటి అంశాలే ప్రధాన కారణమని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నా రు. జీవనశైలిని మార్చుకోక పోతే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు.
ఇదీ లెక్క
● పుట్ట్టుకతోనే శరీరానికి ఇన్సూలిన్ తయారు చేసుకునే శక్తి ఉండక పోతే టైప్–1 మధుమేహంగా పిలుస్తారు. జన్యుపరమైన కారణాలతో ఇది వస్తుంది. వీరికి ఇన్సూలిన్ ఇస్తూ ఉండాలి.
● టైప్–2 మాత్రం మనం చేజేతులా కొని తెచ్చుకున్నదే. ప్రస్తుతం ఇది ప్రమాదకరంగా మారుతోంది. తాజా అధ్యయనాల ప్రకారం కీటోజనిక్ ఆహారంతో నియంత్రణలో పెట్టుకోవచ్చని తేలింది.
● టైప్ –2 ఎక్కువ శాతం ఊబకాయంతో వస్తుంది. అతి మూత్రం, అతి ఆకలి, అతి దాహంతో పాటు ఆహారం చక్కగానే తీసుకుంటున్నా బరువు తగ్గడం, నీరసం, నిస్సత్తువ, అలసట వంటి లక్షణాలుంటే అనుమానించాల్సిందే.
● పరిగడుపున రక్తంలో గ్లూకోజు 125 మి.గ్రా/డీఎల్.. భోజనం చేశాక 200 మి.గ్రా/డీఎల్ కంటే ఎక్కువ ఉంటే మధుమేహం వచ్చినట్లే. ఈ స్థాయిలో పరిగడుపున 100.. తర్వాత 140–200 మధ్యలో ఉన్నా సరే ముందుస్తు (ప్రీడయాబెటీస్) ఉన్నట్లే.
● ఇప్పటికే వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయితే అధిక రక్తపోటు 130/80 దాటకుండా చూసుకోవాలి. ఎల్‌డీఎల్ 70ఎంజీ/డీఎల్‌కు దగ్గరగా ఉండాలి. హెచ్‌డీఎల్ 39ఎంజీ/డీఎల్ కంటే తక్కువగా ఉండాలి. ట్రైగ్లిజరైడ్ల స్థాయిలు దాదాపు 150 ఎంజీ/డీఎల్‌కు దగ్గరగా ఉండాలి.
– డాక్టర్ వెంకటేశ్వర్‌రావు, జిల్లా వైద్యాధికారి
న్యూస్‌రీల్
ఇతర అవయవాలపై ప్రభావం
నవంబర్ 30 నాటికి ఎన్‌సీడీ పోర్టల్ డేటా ప్రకారం జిల్లాలో 13,75,409 మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయగా, వీరిలో 95,239 మంది అధికరక్తపోటుతో బాధపడుతున్నట్లు తేలింది. మరో 47,592 మంది మధుమేహంతో బాధపడుతున్నట్లు గుర్తించారు. ప్రధానంగా టైప్–2 మధుమేహ రోగుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. బాధితుల్లో క్లోమగ్రంథి తగినంత ఇన్సూలిన్ ఉత్పత్తి చేయదు. కొన్నిసార్లు ఇన్సూలిన్ ఉత్పత్తి అయినా దానిని రక్తంలోకి తీసుకెళ్లేందుకు నాళాలు సక్రమంగా పనిచేయవు. తద్వారా రక్తంలో గ్లూకోజు హెచ్చుతగ్గుల సమస్య ఉత్పన్నమవుతుంది. పరోక్షంగా గుండె, కిడ్నీ, కాలేయం, కంటిచూపు పని తీరుపై ప్రభావం చూపుతుంది.
Comments
Please login to add a commentAdd a comment