కబడ్డీ చాంపియన్లు మనోళ్లే
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలోని మెయిన్ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సీఎం కప్ పురుషుల, మహిళల కబడ్డీ చాంపియన్‌షిప్ పోటీలు సోమవారం ఉత్సాహంగా ముగిశాయి. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, రాష్ట్ర క్రీడల వ్యవహారాల సలహాదారు ఏపీ జితేందర్‌రెడ్డి పోటీలను తిలకించారు. పురుషుల, మహిళల ఫైనల్ మ్యాచ్‌ను టాస్‌వేసి ప్రారంభించారు. అనంతరం క్రీడాజట్లకు శుభాకాంక్షలు తెలిపారు. టోర్నీలో పురుషుల, మహిళల విభాగాల్లో రంగారెడ్డి జట్లు చాంపియన్‌షిప్‌లను కై వసం చేసుకున్నాయి. పురుషుల విభాగంలో రంగారెడ్డి, వనపర్తి జట్ల మధ్య మ్యాచ్ ఉత్కంఠంగా సాగింది. మొదటి అర్ధభాగంలో 18–16 పాయింట్ల ఆధిక్యంలో ఉన్న వనపర్తి జట్టు రెండో అర్ధభాగంలో తడబడింది. చివరగా ఆట ముగిసే సమయానికి రంగారెడ్డి 34–31 పాయింట్ల తేడాతో వనపర్తిపై విజయం సాధించింది. మహిళల ఫైనల్లో రంగారెడ్డి 57–39 పాయింట్ల తేడాతో నల్లగొండపై నెగ్గింది. టోర్నీలో గెలుపొందిన జట్లకు త్వరలో హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమంలో ట్రోఫీలు, మెడల్స్ అందజేస్తారని డీవైఎస్‌ఓ శ్రీనివాస్ తెలిపారు.
రాష్ట్ర స్థాయి సీఎం కప్ టోర్నీలో సత్తా
మహిళలు, పురుషుల విభాగాల్లో విజయం
Comments
Please login to add a commentAdd a comment