కల్తీ పాల ఉత్పుత్తుల గుట్టు రట్టు
పసుమాముల కేంద్రంగా తయారీ
సాక్షి, రంగారెడ్డిజిల్లా: కల్తీపాల ఉత్పత్తుల గుట్టును ఫుడ్‌సేప్టీ, టాస్క్‌ఫోర్స్ అధికారులు రట్టు చేశారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం పసుమాముల గ్రామంలో ఆల్ రిచ్ డెయిరీ ప్రైవేట్ లిమిటెడ్ (శ్వేత బ్రాండ్ పాలు, పెరుగు) కేంద్రం నిర్వాహకులు కల్తీపాలు, పెరుగు, నెయ్యిని విక్రయిస్తున్నట్లు గుర్తించారు. రూ.1.68 లక్షల విలువ చేసే 280 కిలోల నెయ్యి ప్యాకెట్లు, 350 కిలోల పాల నుంచి తీసిన క్రీమ్ సహా రూ.22,750 విలువ చేసే 850 కిలోల హానికరమైన కాస్టిక్‌సోడాను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ టీం హెడ్ వి.జ్యోతిర్మయి తెలిపారు. నమూనాలు సేకరించి ల్యాబుకు పంపినట్లు చెప్పారు. పాలల్లో హానికర ఫార్మలిన్, డిటర్జెంట్‌లు, అధిక నీళ్లు కలపడం.. పారిశుద్ధ్య లోపంతో కూడిన ప్రదేశాల్లో పాల ఉత్పత్తులను నిల్వ చేయడం.. లైసెన్స్ లేకున్నా ఉన్నట్లు లేబుళ్లపై ముద్రించడం వంటి నేరాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment