స్వచ్ఛంద వైద్య సేవలు అభినందనీయం
కడ్తాల్: ట్రస్ట్‌ల ద్వారా గ్రామీణా ప్రాంతాల్లోని నిరుపేదలకు స్వచ్ఛంద వైద్య సేవలు అందించడం అభినందనీయమని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. మండల కేంద్రంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్, రాధాకృష్ణ ట్రస్ట్, గంప లక్ష్మయ్య చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్యా శిబిరాన్ని గురువారం ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, ఐపీఎస్ మాజీ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, గిడ్డంగుల సంస్థ మాజీ చైర్ పర్సన్ రజనీసాయిచంద్, మిషన్‌భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్‌గుప్తా, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు దశరథ్‌నాయక్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సబితారెడ్డి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ హయాంలో పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న సంకల్పంతో నగారానికి నలు దిక్కులా నాలుగు అత్యాధునిక టిమ్స్ ఆస్పత్రుల్రను మంజూరు చేసి, పనులు ప్రారంభించడం జరిగిందని గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొరత తీవ్రంగా వేధిస్తోందన్నారు. గత ప్రభుత్వంలో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తే, ప్రస్తుత ప్రభుత్వం గాలికొదిలేసిందని విమర్శించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు విద్య, వైద్యం సక్రమంగా అందితేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్ వెంకటేశ్, ఎల్‌హెచ్‌పీఎస్ ప్రధాన కార్యదర్శి దశరథ్‌నాయక్, మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్, మాజీ సర్పంచ్ లక్ష్మీనర్సింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment