ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి
చేవెళ్ల: ఆదర్శ పాఠశాలల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని ఆదర్శ పాఠశాలల ఔట్‌సోర్సింగ్ ఫిజికల్ డైరెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆంజనేయులు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్‌ను, విద్యాశాఖ కార్యాలయంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ నర్సింహారెడ్డిని వేర్వేరుగా కలిసి వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ.. ఆదర్శ పాఠశాలలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ఏజెన్సీ రెన్యూవల్‌తోపాటు నాలుగు నెలలుగా నిలిచిపోయిన వేతనాలను అందించాలని అధికారులకు వినతిపత్రం అందించామన్నారు. ప్రభుత్వం బడ్జెట్ రిలీజ్ చేసినప్పటికీ అధికారుల నిర్లక్ష్యం, ఏజెన్సీల తప్పిదంతో ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి నాలుగు నెలల నుంచి వేతనాలు అందడం లేదన్నారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన కలెక్టర్ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, విద్యాశాఖ కమిషనర్ నర్సింహారెడ్డి వెంటనే డీఈఓ సుశీంధర్‌రావుకు ఫోన్ చేసి సమస్యలు పరిష్కరించాలని అదేశించారని ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వేద ప్రకాశ్, సభ్యులు విష్ణుప్రియ, కాశీ యాదయ్య, యాదమ్మ, మల్లేశ్, హేమలత, నవనీత, శేఖర్, రాధాకృష్ణ, సతీష్, ఉపేందర్, సుధాకర్, జంగయ్య, తదితరులు ఉన్నారు.
ఆదర్శ పాఠశాలల ఔట్‌సోర్సింగ్ ఫిజికల్ డైరెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆంజనేయులు
Comments
Please login to add a commentAdd a comment