దైవ దర్శనానికి వెళ్లొస్తుండగా..
రోడ్డు ప్రమాదం
● గాయపడిన నేతలు
ఇబ్రహీంపట్నం: శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లి తిరిగివస్తున్న ఇబ్రహీంపట్నం వాసులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆదివారం అర్ధరాత్రి తమిళనాడు–కేరళ సరిహద్దులో చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో ఏడుగురు గాయపడ్డారు. వివరాలు.. ఇబ్రహీంపట్నం మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ బర్ల మంగయాదవ్ భర్త జగదీశ్వర్‌యాదవ్, కౌన్సిలర్లు మంద సుధాకర్, జెర్కొని బాలరాజు, మోహన్‌నాయక్‌తో పాటు కాంగ్రెస్ నాయకుడు గాజుల గోపాల్, బీఆర్‌ఎస్ నాయకుడు కర్నె అరవింద్, కందుకూరు మండలం రాచలూరుకు చెందిన జంగయ్య ఈ నెల 2న శబరిమల అయ్యప్ప దర్శనానికి బయలుదేరారు. శనివారం దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా తమిళనాడు–కేరళ సరిహద్దు నాగర్‌కోయిల్(తమిళనాడు) వద్ద వీరి వాహనం అదుపు తప్పి స్తంభాన్ని ఢీకొట్టింది. గమనించిన స్థానికులు గాయపడిన క్షతగాత్రులను మర్తాండం పట్టణంలోని శాలోం ఆర్థోపెడిక్ ఆస్పత్రికి తరలించగా చికత్స పొందుతున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సోమవారం అక్కడికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment