మౌలిక వసతుల కల్పనకు కృషి
తుర్కయంజాల్: మున్సిపల్ పరిధిలోని అన్ని కాలనీల్లో మౌలిక వసతులు కల్పనకు కృషి చేస్తున్నామని రాష్ట్ర రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి అన్నారు. సోమవారం ఆయన తొర్రూరులోని ఓ ఫంక్షన్ హాల్‌లో మున్సిపల్ చైర్‌పర్సన్ మల్‌రెడ్డి అనురాధ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కౌన్సిల్ సాధారణ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తుర్కయంజాల్ మున్సిపాలిటీ అభివృద్ధి పథంలో పయనిస్తోందని.. దశలవారీగా అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. రెండు నెలల్లో అసంపూర్తి పనులు పూర్తి చేస్తామన్నారు. రూ.80లక్షల నిధులతో పార్క్ స్థలాల చుట్టూ ఫెన్సింగ్, రూ.3.75 కోట్లతో యూజీడీ, సీసీ రోడ్లు, వీధి దీపాల ఏర్పాటు, మరుగుదొడ్ల మరమ్మతులు చేపడతామన్నారు. రూ.1.50 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులతో రోడ్ల మరమ్మతులు, నీటి సరఫరా, అంతర్గత డ్రైనేజీ నిర్వహణకు కేటాయించామని చెప్పారు. హెచ్‌ఆర్‌డీసీఎల్ నుంచి రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్, పారిశుద్ధ్య నిర్వహణ, టీఎస్‌యూఎప్‌ఐడీసీ నిధులతో చేపట్టబోయే పనలను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ అమరేందర్ రెడ్డి, వైస్ చైర్‌పర్సన్ హరిత ధన్‌రాజ్ గౌడ్, కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
రాష్ట్ర రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment