పంటను అమ్మేందుకు వెళ్తుండగా ప్రమాదం
కందుకూరు: పంటను అమ్ముకునేందుకు వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన కందుకూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ పరమేశ్ తెలిపిన ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలం బాలన్‌పల్లికి చెందిన బారు భరత్(20) ఐటీఐ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కాగా తమ పొలంలో పండించిన మిర్చి పంటను ఎండిన తర్వాత గ్రామస్తులు కొమ్ము దయాకర్, పసుపుల కుమార్, ఎం.రమేశ్, జి.సాయి డ్రైవర్ వెలిజల శివకుమార్‌తో కలిసి ఆదివారం రాత్రి హైదరాబాద్ మార్కెట్‌కు బయలు దేరారు. వీరంతా బొలేరో క్యాబిన్ టాప్‌పై కూర్చున్నాడు. మార్గమధ్యలో రాత్రి 11గంటల సమయంలో శ్రీశైలం రహదారి దెబ్బడగూడ గేట్ సమీపంలో కందుకూరు నుంచి కడ్తాల్‌వైపు అతివేగంగా వెళ్తున్న కారు వీరి వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో టాప్‌పైన కూర్చున్నవారంతా కిందపడగా భరత్‌కుమార్‌కు తీవ్రగాయాలవ్వగా.. మిగిలిన వారు స్వల్పగాయాలతో బయటపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్ వాహనంలో ఆస్పత్రికి తరలిస్తుండగా భరత్ మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ మేరకు సీఐ సీతారామ్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ పరమేష్ కేసు దర్యాప్తు చేపట్టారు.
ఆస్పత్రికి తరలించే క్రమంలో యువకుడి మృతి
Comments
Please login to add a commentAdd a comment