హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
షాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఈ నెల 17న రైతు ధర్నా నిర్వహించనున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్న సభా స్థలాన్ని సోమవారం బీఆర్‌ఎస్ యువ నేతలు పట్నం అవినాశ్‌రెడ్డి, పట్లోళ్ల కార్తీక్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ హామీలను పతంగులపై ముద్రించి ప్రజలకు పంపిణీ చేసినట్టు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు నక్క శ్రీనివాస్‌గౌడ్, జడల రాజేందర్‌గౌడ్, కుమ్మరి దర్శన్, అంబారెడ్డి, ముఖ్రంఖాన్, సత్య, రాంచందర్, కమ్మరి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment