బేకరీలో తనిఖీలు
ధారూరు: మండల కేంద్రంలోని న్యూ బెంగళూర్ బేకరీలో ఆదివారం పోలీసులు తనిఖీలు చేశారు. గడువు దాటిన కలర్ డబ్బాలను గుర్తించారు. వీటిని కేక్‌ల తయారీలో వినియోగిస్తున్నట్లు ఎస్‌ఐ వేణుగోపాల్‌గౌడ్ తెలిపారు. కలర్ డబ్బాలను సీజ్ చేసి బేకరీ నిర్వాహకుడు సచిన్‌పై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
బసిరెడ్డిపల్లి వాసికి డాక్టరేట్
పరిగి: మండలంలోని బసిరెడ్డిపల్లికి చెందిన మద్దులపల్లి పద్మ ఉస్మానియ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పట్టా పొందారు. సంస్కృతం విభాగంలో ప్రొఫెసర్ విద్యానంద్ ఆధ్వర్యంలో పీహెచ్‌డీ పట్టా పొందారు. అన్ని భాషలకు సంస్కృతం మూలం అని డాక్టర్ పద్మా అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment