మూసాపేట: ఓ ప్రయాణికుడు కూకట్‌పల్లి ఆర్‌టీసీ బస్సులో మరిచిపోయిన మొబైల్ ఫోన్ ఆదివారం ఆర్టీసీ సిబ్బంది అతడికి అప్పగించారు. వివరాల్లోకి వెళితే..కేపీహెచ్‌బీ నుంచి మెహిదీపట్నం రూట్ నెంబర్19ఎం/పీ బస్సులో మెహిదీపట్నంలో ఎక్కిన ప్రయాణికుడు మసాబ్‌టాంక్ వద్ద దిగి వెళ్లిపోయాడు. బస్సులో అతడు సెల్‌ఫోన్ మర్చిపోయినట్లు గుర్తించిన కండక్టర్ సరిత కూకట్‌పల్లి డిపోలో అందజేసింది. ప్రయాణికుడు డిపో అధికారులను సంప్రదించగా ఆదివారం డిపో ఎస్‌టీఐ మల్లేశం అతడికి మొబైల్ ఫోన్‌ను అందజేశాడు. డ్రైవర్ రాజ్‌కుమార్, కండక్టర్ సరితలను పలువురు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment