వర్గీకరణకు మద్దతుగా మహాప్రదర్శన
ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు పెంటనోళ్ల నర్సింహ మాదిగ
ఆమనగల్లు: హైదరాబాద్‌లో ఫిబ్రవరి 7న ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ‘లక్ష డప్పులు.. వేల గొంతుల మహా ప్రదర్శన’ నిర్వహిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు పెంటనోళ్ల నర్సింహ మాదిగ తెలిపారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. కడ్తాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం ఎమ్మార్పీఎస్ మండల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన నర్సింహ మాదిగ మాట్లాడుతూ.. వర్గీకరణకు మద్దతుగా మహా ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వ్యతిరేకులకు లక్ష డప్పులు.. వేయి గొంతులతో సమాధానం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఎంఎస్‌పీ జిల్లా అధ్యక్షుడు రావుగల్ల బాబుమాదిగ, జిల్లా కార్యదర్శి కిరణ్‌పూలే, ఎమ్మార్పీఎస్ నాయకులు మంగళపల్లి నర్సింహ, గురిగల్ల లక్ష్మయ్య, శంకర్, మంకి శ్రీను, కంబాలపల్లి అంజి, మహేశ్, యాదయ్య, ఒగ్గు మహేశ్, తుప్పరి మహేశ్, తదితరులు పాల్గొన్నారు. అనంతరం కడ్తాల మండల ఎమ్మార్పీఎస్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా అబ్బు రమేశ్ మాదిగ, ఉపాధ్యక్షులుగా నరేశ్, మహేందర్, కార్యదర్శిగా యాదయ్య ఎన్నికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment