ఉప్పల్: ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రామంతాపూర్, వాసవి కాలనీ, వెంకట్‌రెడ్డి నగర్‌కు చెందిన జస్వంత్(23) ఓయూలో ఎమ్మెస్సీ మొదటి సంవ త్సరం చదువుతున్నాడు. శనివారం రాత్రి భోజనం చేసి నిద్రించేందుకు పెంట్ హస్‌లోకి వెళ్లాడు. ఆదివారం ఉదయం అతడి తమ్ముడు సాయిచరణ్ పెంట్‌హస్‌లోకి వెళ్లి చూడగా గదిలో కనిపించలేదు. బాతురూమ్ గడియపెట్టి ఉండటంతో అతను బాత్‌రూమ్ తలుపులు తెరిచి చూడగా జస్వంత్ కరెంట్ వైర్‌తో ఉరివేసుకుని కనిపించాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యా ప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment