చౌటుప్పల్: హైదరాబాద్ మలక్‌పేటలోని హైదరాబాద్ కిడ్నీ సెంటర్ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ ఎర్రబోతు విష్ణువర్దన్‌రెడ్డి(68) సోమవారం మృతి చెందారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లి గ్రామానికి చెందిన ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం స్థానికంగానే జరిగింది. వైద్య వృత్తిలోకి వచ్చాక సొంతంగా ఆస్పత్రి ఏర్పాటు చేసుకున్నారు. ఎంతోమంది కిడ్నీ రోగులకు వైద్య సేవలందించారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డాక్టర్ విష్ణువర్దన్‌రెడ్డి హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సోమవారం ఉదయం మృతి చెందారు.
Comments
Please login to add a commentAdd a comment