ఉత్సాహంగా డ్రైవర్స్ డే
ఇబ్రహీంపట్నం: రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఇబ్రహీంపట్నం డిపో మేనేజర్ వెంకటనర్సప్ప ఆధ్వర్యంలో శుక్రవారం డ్రైవర్స్ డే నిర్వహించారు. డిపో నుంచి ఇబ్రహీంపట్నం అంబేడ్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. బస్‌స్టేషన్‌లోని డ్రైవర్లకు గులాబీ పూలు అందించారు. అనంతరం డిపోలో జరిగిన కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ గురునాయుడు మాట్లాడుతూ.. మానసికంగా, శారీరకంగా డ్రైవర్లు ఆరోగ్యంగా ఉండాలని అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలని తెలిపారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దని, రోడ్డు మధ్యలో వాహనం నిలపొద్దని సూచించారు. వేగంగా యూ టర్న్ చేయడం, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడంతో చాలా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా ప్రమాద రహిత డ్రైవర్లుగా ఎంపికై న ఎండీ జియాద్దీన్, వెంకటయ్య, యాదయ్య (ఆర్టీసీ)తో పాటు అద్దె బస్సు డ్రైవర్లు పి.కృష్ణారెడ్డి, లింగం, మహేశ్, ఎండీ ఖైసర్‌కు ట్రాఫిక్ సీఐ గురునాయుడు, ఎస్‌ఐ సాయినాథ్ అవార్డులు అందజేసి సన్మానించారు. కార్యక్రమంలో డిపో అసిస్టెంట్ మేనేజర్ రాజేశ్, అసిస్టెంట్ ఇంజినీర్ అజయ్, ఎస్‌టీఐ వెంకట్‌నాయక్, ఈడబ్లూబీ మెంబర్ జంగయ్య, సూపర్‌వైజర్లు సదానందం, ఆంజనేయులు, శ్రీనివాస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment