బిస్మాట్ రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక
తుర్కయంజాల్: బడ్జెట్ స్కూల్, చిన్న తరహా స్కూళ్ల పరిరక్షణే ధ్యేయంగా బిస్మాట్ ఆవిర్భవించడం హర్షించదగ్గ విషయం అని రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య అన్నారు. తుర్కయంజాల్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన తెలంగాణ బడ్జెట్ స్కూల్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (బిస్మాట్) రాష్ట్ర కార్యవర్గ ఎన్నిక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీపతి శేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా జగ్గు మల్లారెడ్డి, కోశాధికారిగా జె.శ్రీనివాస రావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా గుజ్జ సత్యం, షేక్ షరీఫ్, కె.దయాకర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ పి. జలంధర్ రెడ్డి, సలహాదారులుగా రాధాకృష్ణ, టి.బుచ్చిరెడ్డిని ఎన్నుకున్నారు. రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా జి.నారాయణ రెడ్డి, కార్యదర్శిగా ఎ.భరత్ కుమార్, కోశాధికారి సీహెచ్ మీనేందర్ రావును ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment