నిరుద్యోగ యువతకు ఉపాధి లక్ష్యం
మహేశ్వరం: నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని మన్సాన్‌పల్లి చౌరస్తాలో శుక్రవారం మెగా జాబ్ మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చదువుకున్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్ అని కాకుండా ఏదో ఒక రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే ధ్యేయమని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకొని ఈ మెగా జాబ్ మేళా నిర్వహించినట్టు తెలిపారు. రాష్ట్రంలో రూ.లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్, కేటీఆర్‌కే దక్కుతుందన్నారు. గుజరాత్ రాష్ట్రానికి తరలుతున్న ఫాక్స్‌కాన్ కంపెనీని కేసీఆర్, కేటీఆర్ పట్టుబట్టి కొంగరకలాన్‌లో ఏర్పాటు చేశారన్నారు. రావిర్యాల, తుక్కుగూడ, మహేశ్వరం, చందనవెళ్లి, షాబాద్‌లో భారీ పరిశ్రమలు స్థాపించిన ఘనత బీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అంతకు ముందు 25 కంపెనీల ప్రతినిధులు 3 వేల ఉద్యోగాల కోసం ఎంపికలు నిర్వహించారు. ఎంపికై న వారికి ఎమ్మెల్యే నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ మంచె పాండు యాదవ్, వైస్ చైర్మన్ దేవరంపల్లి వెంకటేశ్వరరెడ్డి, బీఆర్‌ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు హన్మగళ్ల చంద్రయ్య, మండల అధ్యక్షుడు రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే సబితారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment