వానాకాలం పంటకు ప్రభుత్వం రైతు బంధు వేయలేదు. ఇప్పుడు కొనుగోలు కేంద్రం వడ్లు అమ్మితే డబ్బులు ఏసేది ఏం నమ్మకం. వానాకాలం పంట పెట్టుబడికి తెచ్చిన షావుకారికి డబ్బులు కట్టాలని వరి కోసిన వెంటనే పందిళ్ల మిల్లులో క్వింటాల్ ధర రూ.1,950 అని సంచి కిలో, మట్టి కిలో క్యాష్ కటింగ్‌తో 15 క్వింటాళ్లకు లెక్క చేసి డబ్బులు ఇచ్చారు. ఎండిన వడ్లకు అదే ధర, పచ్చి వడ్లకు అదే ధర పెట్టి రైతుల అవసరం చూసి వ్యాపారులు మోసాలు చేస్తున్నారు.
– చుక్క శ్రీనివాస్, పొట్లపల్లి
Comments
Please login to add a commentAdd a comment