వైద్యసేవల్లో నిర్లక్ష్యం తగదు
● రాష్ట్ర వైద్య విధాన పరిషత్
కమిషనర్ అజయ్‌కుమార్
● దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రి
ఆకస్మిక తనిఖీ
దుబ్బాక: ప్రభుత్వం పేదలకు అన్ని రకాల వైద్యసేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటోందని వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్‌కుమార్ అన్నారు. బుధవారం దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని అన్ని వార్డులను కలియ తిరిగారు. రోగులతో మాట్లాడి అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు వైద్యపరంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది, మందుల కొరత లేకుండా అన్ని సౌకర్యాలున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment