మట్టి దిబ్బలు, పిచ్చిమొక్కలే..
మట్టికుప్పలు.. రాళ్లు.. పిచ్చి మొక్కలతో సుడా టౌన్ షిప్ అధ్వానంగా తయారైంది. దీంతో ప్లాట్లు కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు. ఇప్పటి వరకు మూడు సార్లు వేలం పాట నిర్వహించినా 27 ప్లాట్లే విక్రయించారు. ఇంకా 79 ప్లాట్లు మిగిలి ఉన్నాయి. మరోవైపు టౌన్‌షిప్‌లో పనులు అసంపూర్తిగా ఉండటం.. రియల్ ఎస్టేట్ రంగం కుదేలు కావడం కూడా ఎవరూ ఆసక్తి చూపడంలేదన్న చర్చ జరుగుతోంది.
సాక్షి, సిద్దిపేట: గత ప్రభుత్వం 9 డిసెంబర్ 2022న విడుదల చేసిన జీఓ (234) ప్రకారం సిద్దిపేట పట్టణ శివారు మిట్టపల్లి సమీపంలో 14 ఎకరాల అసైన్డ్ భూములను సుడా సేకరించింది. రాష్ట్రంలోనే తొలిసారిగా అసైన్డ్ ల్యాండ్ పూలింగ్‌తో లే అవుట్ చేశారు. భూమిని పూర్తి చదును చేయగా అందులో 67,760 గజాల భూమి ఉంది. ప్రధాన రోడ్డు 60ఫీట్లు, అంతర్గత రోడ్లు 33ఫీట్లతో నిర్మించారు. రోడ్లకు 23,909 గజాలు, పార్కులకు 6,099 గజాలు, ఇతర మౌలిక సదుపాయలకు 2,392 గజాలు కేటాయించారు. 35,360 గజాల స్థలం మిగలగా అందులో 161 ప్లాట్లను విభజించారు. అందులో 10 మంది రైతులకు 55 ప్లాట్లను సుమారుగా 10,861 గజాల భూమిని అందించగా 101 ప్లాట్లలో 24,499 గజాల స్థలం సుడాకు మిగిలింది. వీటి ని వేలం పాట ద్వారా ప్లాట్లను విక్రయిస్తున్నారు.
మూడు సార్లు వేలం
సుడా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మోడల్ టౌన్ షిప్‌లో మూడు సార్లు వేలం నిర్వహించగా 27 ప్లాట్లను కొనుగోలు చేశారు. గత సంవత్సరం మే 29, 30 తేదీల్లో వేలం పాట నిర్వహించగా 17 మంది దక్కించుకున్నారు. అందులో ఇప్పటి వరకు 13 మంది మాత్రమే పూర్తిగా డబ్బులు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇంకా నలుగురు మొత్తం డబ్బులు చెల్లించకపోవడంతో వారికి రిజిస్ట్రేషన్‌ను సుడా చేయలేదు.
అధ్వానంగా సుడా టౌన్ షిప్
ఇలా ఉంటే ప్లాట్లు కొనేదెలా?
మూడు సార్లు వేలం వేసినా
27 ప్లాట్లే విక్రయం
ఆసక్తిచూపని కొనుగోలు దారులు
Comments
Please login to add a commentAdd a comment