నేటి నుంచి వైజ్ఞానిక ప్రదర్శనలు
డీఈవో వెంకటేశ్వర్లు
సంగారెడ్డిఎడ్యుకేషన్: విద్యార్థులలో దాగివున్న శాసీ్త్రయ నైపుణ్యాన్ని వెలికితీయడంతోపాటు విద్యార్థులను బాలశాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రతీ ఏటా ప్రభుత్వం నిర్వహించే వైజ్ఞానిక ప్రదర్శనలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు జిల్లా విద్యాధికారి (డీఈవో) వెంకటేశ్వర్లు మీడియాకు వెల్లడించారు. సంగారెడ్డిలోని శాంతినగర్‌లోని సెయింట్ ఆంథోనీస్ పాఠశాలలో బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ... ఈ ఏడాది అన్ని యాజమాన్యాల పాఠశాలలు కలిపి సుమారు 850వరకు ఎగ్జిబిట్స్ ప్రదర్శనకు వస్తుండగా ఇన్‌స్పైర్‌కు 95 ఎగ్జిబిట్ రానున్నాయన్నారు. వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రధాన అంశంగా సుస్థిర భవిష్యత్తు కోసం శాస్త్ర సాంకేతికత (సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్) అనే అంశానికి ఏడు ఉప అంశాలతో జిల్లా స్థాయి రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వీటిలో 1.రవాణా కమ్యూనికేషన్ 2.వ్యర్థాల నిర్వహణ 3.ఆహారం ఆరోగ్యం, పరిశుభ్రత 4.సహజ వ్యవసాయం 5.విపత్తుల నిర్వహణ 6.గణిత నమూనాలు, గణన ఆలోచనలు 7.వనరుల నిర్వహణ లాంటి ఉప అంశాలు ఉన్నాయని వివరించారు. విద్యార్థులు తమకు సంబంధించిన ఉప అంశాల వారీగా కేటాయించిన కౌంటర్లలో ఉదయం ఉదయం 7:30 నుంచి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. ఈ వైజ్ఞానిక ప్రదర్శనలో ఎంపికై న మంచి ఎగ్జిబిట్‌లను రాష్ట్ర స్థాయికి పంపించనున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి ,మాజీ సైన్స్ అధికారి విజయ్ కుమార్, నోడల్ అధికారి లింభాజీ, సంగారెడ్డి మండల విద్యాధికారి శ్రీ విద్యాసాగర్, కోహిర్ మండల విద్యాధికారి, ప్రింట్ అండ్ మీడియా కన్వీనర్ జాకీర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment