● ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి ● ఐకేపీ ద్వారా 2 లక్షల
నారాయణఖేడ్: నారాయణఖేడ్ నియోజకవర్గంలో గత ప్రభుత్వం కంటే ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటివరకు ఐకేపీ ఆధ్వర్యంలో రికార్డు స్థాయిలో 2లక్షల క్వింటాళ్ల పైచిలుకు వరి ధాన్యం కొనుగోలు చేసినట్లు ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి తెలిపారు. నారాయణఖేడ్‌లోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...గతం కంటే 40% అధికంగా ధాన్యం కొనుగోళ్లు చేశామన్నారు. దీనికి పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన ధాన్యం మరింత అదనమని తెలిపారు. గత ప్రభుత్వంలో నాయకులు, దళారులు కుమ్మకై ్క క్వింటాలుకు వరి ధాన్యం తూకం వేస్తే 8 నుంచి 9 కిలోల తరుగు తీసి దోపిడీ చేసేవారని ఆరోపించారు. ప్రస్తుతం ప్యాడీ క్లీనర్‌లో వేయనందున 2 కిలోలలోపు మాత్రమే తరుగు తీస్తున్నారని తెలిపారు. గతంలో రైసుమిల్లర్లతో కుమ్మకై ్క రాష్ట్రవ్యాప్తంగా రూ.25 వేల కోట్ల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. తమ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల వద్ద కొన్న ధాన్యం ఆయా నిర్దేశించిన రైసుమిల్లులకు పంపిస్తే వెంటనే అన్‌లోడ్ చేస్తున్నారని, కొత్త పాలసీతో రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని తెలిపారు. ఖేడ్ బసవేశ్వర ప్రాజెక్టుకు సర్వే చేయక, డీపీఆర్ రూపొందించక, నిధులు కేటాయించక ఎన్నికలకు ముందు మభ్యపెట్టడానికే జీవో తెచ్చి శంకుస్థాపన చేశారని ఆరోపించారు. ఎనిమిది టీఎంసీల నీటిని సింగూరుకు మళ్లించి బసవేశ్వర ఎత్తిపోతల ద్వారా సాగునీరు అందించాలని తాను డిప్యూటీ సీఎం, మంత్రులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లానని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్, బీజేపీ కుట్రలను ప్రజలకు వివరించి తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్, కౌన్సిలర్లు వివేకానంద్, హన్మాండ్లు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు భోజిరెడ్డి, న్యాయవాది సంగన్న పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment