బ్యాంకుల్లో అలారమ్ సిస్టమ్ తప్పనిసరి
గజ్వేల్ ఏసీపీ పురుషోత్తంరెడ్డి
కొండపాక(గజ్వేల్): బ్యాంకులో దోపిడీలు జరిగేటప్పుడు అలారమ్ మోగేలా చూసుకోవాలని గజ్వేల్ ఏసీపీ పురుషోత్తంరెడ్డి పేర్కొన్నారు. కుకునూరుపల్లి మండల కేంద్రంలోని సేఫ్ అండ్ సెక్యూరిటీ కార్యక్రమంలో భాగంగా బుధవారం వివిద బ్యాంకులను పరిశీలించారు. ఈ సందర్భంగా పురుశోత్తంరెడ్డి మాట్లాడుతూ.. బ్యాంకుల్లో సీసీ కెమెరాలు ఎల్లవేళలా పని చేస్తున్నాయా లేదానన్న విషయాన్ని ప్రతీ రోజు మానిటరింగ్ చేసుకోవాలన్నారు. నేర ఘటనలు చోటు చేసుకున్నప్పుడు అలారమ్ వచ్చే సిస్టమ్ ఎల్లవేళలా పని చేసేలా ఉండాలన్నారు. బ్యాంకులో కిటికీలు, డోర్స్, స్ట్రాంగ్ రూమ్స్‌లను 15 రోజులకోమారు పని చేస్తున్నాయా.. లేదా అన్న విషయాన్ని పరిశీలించుకోవాలన్నారు. ఆయా బ్యాంకు మేనేజర్ల వద్ద ఎస్సై ఫోన్ నంబరు అందుబాటులో ఉండాలన్నారు. ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు డబ్బులు, బంగారు ఆభరణాలను తీసుకెళ్లేటప్పుడు తప్పనిసరిగా సెక్యూరిటీ మేజర్స్‌ను వెంట తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో తొగుట సీఐ లతీఫ్, ఎస్సై శ్రీనివాస్, ఆయా బ్యాంకుల మేనేజర్లు, సిబ్బంది, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment