బ్యాంకుల్లో సీసీ కెమెరాలు మానిటర్‌ చేయాలి | - | Sakshi
Sakshi News home page

బ్యాంకుల్లో సీసీ కెమెరాలు మానిటర్‌ చేయాలి

Published Fri, Nov 22 2024 7:30 AM | Last Updated on Fri, Nov 22 2024 7:30 AM

బ్యాంకుల్లో సీసీ కెమెరాలు మానిటర్‌ చేయాలి

బ్యాంకుల్లో సీసీ కెమెరాలు మానిటర్‌ చేయాలి

ఏసీీపీ సతీష్‌

హుస్నాబాద్‌: బ్యాంకుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రతి రోజు మానిటర్‌ చేస్తూ సెక్యూరిటీ గార్డును ఏర్పాటు చేసుకోవాలని ఏసీపీ సతీష్‌ పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని ఎస్‌బీఐతో పాటు పలు బ్యాంక్‌లను ఏసీపీ సతీష్‌, సీఐ శ్రీనివాస్‌, ఎస్సై మహేశ్‌లు సందర్శించారు. బ్యాంక్‌ల్లో ఉన్న సెక్యూరిటీ మేజర్స్‌ గురించి బ్యాంక్‌ మేనేజర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. బ్యాంక్‌లో ఏ సంఘటన జరిగినా అలారం సిస్టమ్‌ పని చేసేలా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. బ్యాంక్‌లో ఉన్న కిటికీలు, డోర్స్‌, స్ట్రాంగ్‌ రూమ్‌ 15 రోజులకొక్కసారి వాటి పనితీరుపై తనిఖీ చేయాలని సూచించారు. ప్రజలు దాచిపెట్టుకున్న బంగారం, డబ్బులు కాపాడటానికి సమన్వయంతో విధులు నిర్వహించాలన్నారు. రాత్రి, పగలు సమయంలో పోలీస్‌ అధికారులు రోజుకు రెండుసార్లు బ్యాంక్‌లను తనిఖీ చేసేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. మెయిన్‌ బ్రాంచ్‌ నుంచి ఇతర బ్యాంక్‌లకు డబ్బులు తీసుకొని వెళ్లేటప్పుడు అన్ని సెక్యూరిటీ మేజర్స్‌ తీసుకోవాలన్నారు.

సైబర్‌ వలలో ప్రైవేట్‌ ఉద్యోగి

రూ.7.16లక్షలు పోగొట్టుకున్న వైనం

పటాన్‌చెరు టౌన్‌: ఓ వ్యక్తి సైబర్‌ మోసానికి గురయ్యాడు. మనీ లాండరింగ్‌ కేసులో సస్పెక్ట్‌గా ఉన్నావని, పేరు తప్పించేందుకు డబ్బులు ఇవ్వాలని ఫోన్‌ చేసి బెదిరించడంతో ఓ ప్రైవేట్‌ ఉద్యోగి 7.16లక్షలు సమర్పించుకున్నాడు. ఈ సంఘటన అమీన్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అమీన్‌పూర్‌ పరిధిలోని సాయి భగవాన్‌ కాలనీకి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగికి ఈనెల 18న అపరిచిత వ్యక్తుల నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చింది. పోలీసు డిపార్ట్‌మెంట్‌ నుంచి కాల్‌ చేస్తున్నామని మనీలాండరింగ్‌ కేసులో మీ పేరు ఉందని, పేరు తప్పించేందుకు డబ్బులు ఇవ్వాలని భయబ్రాంతులకు గురి చేశారు. దీంతో సదరు ఉద్యోగి అపరిచిత వ్యక్తి చెప్పిన విధంగా పలు దఫాలుగా రూ.7.16లక్షలు వేశాడు. అపరిచిత వ్యక్తి ఇంకా డబ్బులు వేయాలని అడగడంతో అనుమానం వచ్చిన బాధితుడు.. ముందుగా సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసి, అనంతరం గురువారం అమీన్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

హత్య కేసులో జీవిత ఖైదు

జహీరాబాద్‌ టౌన్‌: ఓ హత్య కేసులో సంగారెడ్డి కోర్టు నిందితుడికి జీవిత ఖైదు శిక్ష విధించింది. పట్టణ ఎస్‌ఐ కాశీనాథ్‌ కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా కల్యాణదుర్గంకు చెందిన పవార్‌ రాజు కుటుంబం జహీరాబాద్‌కు ఉపాధి కోసం వలస వచ్చి చిరువ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మహారాష్ట్రలోని లాతూర్‌ జిల్లా నీలంగా పట్టణానికి చెందిన పవార్‌ శ్రీకాంత్‌(23) కూడా జహీరాబాద్‌కు వచ్చి ఇక్కడే వ్యాపారం చేసుకుంటున్నాడు. ఇద్దరి మధ్య స్నేహం కుదరడంతో తల్లి ఆరో గ్యం బాగు లేదని శ్రీకాంత్‌ రాజు పవార్‌ వద్ద రూ.10 వేల అప్పు తీసుకున్నాడు. తీసుకున్న అప్పు అడిగినందుకు రాజుపై కక్ష పెంచుకుని హత్య చేశాడు. కేసు పూర్వపరాలను విన్న జిల్లా జడ్జి జి.భవానీ చంద్ర నిందితుడికి జీవిత ఖైదు శిక్ష విధిస్తూ గురువారం తీర్పు చెప్పారు.

కాటేసిన కరెంట్‌ తీగ

ఝరాసంగం(జహీరాబాద్‌): అడవి పందుల బెడద నుంచి పంట రక్షణ కోసం అమర్చిన విద్యుత్‌ తీగ తగిలి ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. దేవరంపల్లి గ్రామానికి చెందిన నసీర్‌ సాబ్‌(49) జహీరాబాద్‌కు కుమారుడితో కలిసి వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తు న్న క్రమంలో జీర్లపల్లి గ్రామ శివారులో ఓ వ్యవసాయ పొలం వద్ద నీరు తాగేందుకు వెళ్లా డు. పంట రక్షణ కొరకు వేసిన తీగను గమనించక విద్యుత్‌ షాక్‌ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నరేష్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement