రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపిక
కొండపాక(గజ్వేల్): కొండపాక ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి బాక్సింగ్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభను కనబర్చారు. దీంతో రాష్ట్ర స్థాయిలో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకున్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బాక్సింగ్ పోటీల్లో కొండపాక హైస్కూల్‌కు చెందిన బాలికల విభాగంలో పూజిత, హారిక, పూజ, శృతి, ఉమామహేశ్వరి, కృష్ణవేణి ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. సిర్సనగండ్ల హైస్కూల్‌కు చెందిన విద్యార్థులు మహేశ్, రేవంత్, అనిల్ ప్రథమ స్థానం, సోహెల్, నిఖిల్, వినీలా ద్వితీయ స్థానంలో నిలిచారు. వీరిని ఎంఈఓ శ్రీనివాస్‌రెడ్డి అభినందించారు. అలాగే.. కుకునూరుపల్లి ఉన్నత పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు నితీశ్, ఖలీద్, ముస్తాక్, అరుణ్, శివాణి జూనియర్ విభాగంలో రాణించడంతో ఎంఈఓ సత్తయ్య అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్లు భాస్కర్‌రెడ్డి, ఉప్పలయ్య, రాజ్‌కుమార్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
ఈత పోటీలకు..
సంగారెడ్డి: డిస్ట్రిక్ స్పోర్ట్స్ అథారిటీ స్విమ్మింగ్ పూల్‌లో నిర్వహించిన 35వ సౌత్‌జోన్ ఆక్వాటిక్ చాంపియన్ షిప్‌కు విద్యార్థులు ఎంపికయ్యారు. సబ్ జూనియర్స్, జూనియర్స్ బాలబాలికలకు జిల్లాస్థాయి ఈత పోటీలను గురువారం ప్రారంభించారు. టీఎన్జీఎస్ జిల్లా అధ్యక్షుడు జావిద్‌అలీ, డీవైఎస్‌ఓ కాసిం బేగ్ సబ్ జూనియర్, జూనియర్‌లో బాలబాలికలు రాష్ట్రస్థాయికి వివిధ విభాగాల్లో ఎంపికై న వారిని ప్రకటించారు. మహమ్మద్ అబ్దుర్ రెహమాన్ సిద్ధిఖ్, అలియా ఫాతిమా, నిషిత బాబ్జీ, రితిక, సాహితీ, అబ్దుల్ నజీర్, మహమ్మద్ హుజేర్, వినీత్, విన్సెంట్, మనస్వినిరెడ్డి, అనికాసింగ్, రోషిత్ మోక్షా, ఆద్మియా వైష్విక్, అద్విక ఆఫ్ఫాన్, తక్షిత్, వంశీ ఉన్నారు. డిసెంబర్‌లో భూపాలపల్లిలో జరిగే 9వ తెలంగాణ వింటర్ ఇంటర్ డిస్ట్రిక్ స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్ 2024 రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని స్విమ్మింగ్ కోచ్ శేషుకుమార్ తెలిపారు.
రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలకు నిఖిల్
మిరుదొడ్డి(దుబ్బాక): మండల పరిధిలోని అల్వాల చెప్యాల క్రాస్‌రోడ్డులోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో 9వ, తరగతి చదువుతున్న నిఖిల్ ఎస్‌జీఎఫ్ అండర్–14 విభాగంలో రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ రఘునందన్ రావు గురువారం తెలిపారు. బుధవారం కొండపాక మండలంలో జరిగిన బాక్సింగ్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ఉమ్మడి జిల్లా జట్టుకు ఎంపికై నట్లు తెలిపారు. 22న హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీల్లో పాల్గొననున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న నిఖిల్‌ను ఫిజికల్ డైరెక్టర్లు శ్రీరాములు, మధు, టీచర్లు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment