నా ఉన్నతికి ఊతం
భర్త ప్రోత్సాహం... స్నేహితురాలి సలహా..
సంగారెడ్డి జోన్...●
ప్రణాళిక బద్ధంగా కష్టపడి చదివితే విజయం వరిస్తుంది. నిరాశ, నిస్పృహలతో కృంగిపోకుండా అనుకున్న లక్ష్యం నెరవేరేంత వరకు పట్టుదలతో చదువుకోవాలి. అప్పుడే గమ్యాన్ని ముద్దాడుతాం. అపజయం ఎదురైనా వెనుకడుగు వేయకుండా ముందుకు సాగాలి. చదివే సమయంలో మంచి ఉద్యోగం సాధించి ప్రజలకు సేవచేయాలనే కుటుంబ సభ్యుల సూచన... ఉద్యోగం చేస్తున్న సమయంలో స్నేహితురాలు అందించిన సలహా.. భర్త ప్రోత్సాహంతో ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యం.. తన జీవితం ఉన్నతికి టర్నింగ్ పాయింట్ అయింది. సివిల్స్ సాధించాలని ఉన్నా.. ఇంటర్వ్యూ వరకు వెళ్లినా రాకపోయినప్పటికీ ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా గ్రూప్స్‌కు సిద్ధం అయ్యా. 2017లో విడుదలైన ఫలితాలలో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించా. విద్య, కుటుంబం, ఉద్యోగం.. ఈ స్థాయికి రావడానికి గల కారణాలను అదనపు కలెక్టర్ ఆర్‌డీ మాధురి సాక్షికి వివరించారు.
బాల్యం–విద్యాభ్యాసం
మాది ములుగు జిల్లా మంగపేట మండల పరిధిలోని ఏటూరు నాగారం గ్రామం. పదో తరగతి వరకు హైదరాబాద్‌లో, ఇంటర్మీడియెట్ విశాఖపట్నంలో, నర్సాపూర్‌లోని బీవీఆర్ ఐటీలో ఎంటెక్ పూర్తి చేశారు.
గ్రూప్–1 లో మొదటి ర్యాంకు
2016లో విడుదలైన నోటిఫికేషన్లో గ్రూప్–1 పరీక్ష రాశాను. 2017లో విడుదలైన ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించా. మొదటి ప్రయత్నంలోనే ఉత్తమ ర్యాంకు సాధించినందుకు గర్వంగా ఉంది. ఎలాంటి కోచింగ్ లేకుండానే సిలబస్ చూసుకొని హైదరాబాద్‌లోని వికాస్ బుక్ స్టోర్‌లో మెటీరియల్ కొనుగోలు చేసి పరీక్షలకు సిద్ధం అయ్యా. రంగారెడ్డిలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌గా, జగిత్యాల ఆర్డీఓగా విధులు నిర్వహించి.. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ)గా విధులు నిర్వహిస్తున్నా.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూనే..
ఓవైపు వచ్చిన ఉద్యోగం వదలకుండా సాఫ్ఠ్‌వేర్ ఉద్యోగం చేస్తూనే, ప్రజాసేవ చేయాలని లక్ష్యంతో గ్రూప్స్‌కు సిద్ధం అయ్యా, బెంగళూరులోని ఐబీఎం సాండ్ డిస్క్‌లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేశాను. ఇస్రోలో ఉద్యోగానికి ఎంపికై నప్పటకీ జాయిన్ కాలేదు. యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికాలో ఆరు నెలల పాటు సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగం చేశాను. ఓవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు గ్రూప్స్‌కు సిద్ధమై ఉత్తమ ర్యాంకు సాధించానని మాధురి చెప్పుకొచ్చారు.
శిక్షణలో సమస్యల పరిష్కారం
విచారణపై నేర్చుకున్నా
శిక్షణలో ఉన్న సమయంలో సమస్యలను ఏ విధంగా సమస్యలు పరిష్కరించాలి, విచారణ ఏ విధంగా చేపట్టాలి అనే అంశాలు నేర్చుకున్నాను. ప్రజావాణిలో భాగంగా వచ్చే ఫిర్యాదులు త్వరితగతిన ఏ విధంగా పరిష్కరించాలో నేర్చుకున్నా. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలను గుర్తించడం తెలుసుకోవడం జరిగింది.
కష్టపడి చదివితే విజయం
ప్రతి ఒక్కరూ కష్టపడి చదువుకోవాలి. అప్పుడే విజయం వరిస్తుంది. ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా, పుకార్లు నమ్మొద్దు. నాకు వస్తుందో లేదోనని ప్రతి ఒక్కరు అనుకుంటారు. అలా ఎవరు అనుకోవద్దు. నాకు జాబ్ వస్తుంది అని అనుకుని నమ్మకంతో చదువుకోవాలి. చదువుపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రిపరేషన్ కావాలి. నిజంగా చదువుకునే వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
భర్త సాఫ్ట్‌వేర్ ఉద్యోగి
నేను సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్‌గా, భర్త ప్రదీప్ ఇన్ఫోసెస్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. శ్రీకర్ ఏడవ తరగతి, ఆర్యన్ ఒకటో తరగతి చదువుకుంటున్నారు.
బతుకమ్మ పండుగంటే ఎంతో ఇష్టం
తెలంగాణ ఆచార, సాంప్రదాయాలకు ప్రతీక ప్రకృతిని ఆరాధించే బతుకమ్మ పండుగ అంటే ఎంతో ఇష్టం. అదేవిధంగా బాస్కెట్ బాల్ ఆడటం అంటే ఆసక్తి.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూనే గ్రూప్స్‌కు సిద్ధం
రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు
సాక్షి భవిత ఎంతో దోహదపడింది
కష్టపడడంతో పాటు ప్రణాళిక బద్ధంగా చదువుకోవాలి
సంగారెడ్డి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఆర్‌డీ మాధురి
సాక్షి భవిత ఎంతో సహకారం
సాక్షి దినపత్రికలో వచ్చే భవిత మెటీరియల్ గ్రూప్స్ ప్రిపరేషన్‌కు ఎంతో దోహదపడింది. భవితలో పరీక్షకు సంబంధించి ముఖ్యమైన ప్రశ్నలతో పాటుగా సిలబస్ వచ్చేది. నేను యూఎస్‌లో ఉన్నప్పుడు గ్రూప్స్‌కి సంబంధించిన ఫలితాలు విడుదల కాగానే సాక్షి మీడియా ద్వారానే రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు వచ్చిందని తెలుసుకున్నా.
Comments
Please login to add a commentAdd a comment