ఫోర్జరీతో ప్లాట్ అమ్మి.. పోలీసులకు చిక్కి
20 ఏళ్ల తర్వాత వెలుగులోకి మోసం
● కొల్లూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఘటన ● నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు ● రిమాండ్‌కు తరలింపు
రామచంద్రాపురం (పటాన్‌చెరు): తనది కాని ప్లాట్‌ను కాజేయాలనుకుని ఏకంగా ప్లాట్ యజమాని సంతకాన్ని ఫోర్జరీ చేసి రిజిసే్ట్రషన్ చేయించుకున్నాడు ఓ వ్యక్తి. ఇరవై ఏళ్ల తర్వాత చేసిన మోసం బయటపడి పోలీసులకు చిక్కగా కోర్టు ఆదేశాల మేరకు అతడిని రిమాండ్‌కు తరలించారు. కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నా యి. హైదరాబాద్‌కు చెందిన శశికళ అగర్వాల్ తెల్లాపూర్‌లోని ఏ బ్లాక్‌లో ఓ ప్లాట్‌ను కొనుగోలు చేసింది. అదే ప్లాట్‌ను 2003లో బీరంగూడలో నివాసముండే ఊరేళ్ల రాజేందర్ ప్లాట్ అసలు యజమాని శశికళ అగర్వాల్ సంతకాలను ఫోర్జరీ చేసి అతడి పేరుమీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. తిరిగి ఆ ప్లాట్‌ను తొమ్మిది రోజుల తర్వాత మరొకరికి అమ్మేశాడు. అలా ఆ ప్లాటు చేతులు మారుతూ తెల్లాపూర్ నివాసి భుజంగారెడ్డి పేరు మీదికి వచ్చింది. కాగా, అసలు యజమాని శశికళ అగర్వాల్ 2023లో తన ప్లాట్‌ను రామచంద్రాపురం పట్టణానికి చెందిన రాజు అనే వ్యక్తికి విక్రయించింది. రాజు తన ప్లాట్ వద్దకు వెళ్లగా అక్కడ భుజంగారెడ్డి చేపట్టిన భవన నిర్మాణం చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు ప్లాట్ డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ కార్యాలయానికి పంపి వేలిముద్రలను పరిశీలించారు. దాంతో ఊరెళ్ళ రాజేందర్ ప్లాట్ ఓనర్ శశికళ అగర్వాల్ సంతకాలను ఫోర్జరీ చేసినట్లు తేలింది. దీంతో అతడిని పోలీసులు గురువారం అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం ఆదేశాలమేరకు అతడిని రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment