కృత్రిమ మేధతో అనేక ఉపయోగాలు
సిద్దిపేటఎడ్యుకేషన్: కృత్రిమ మేధస్సు ఆర్టి ఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అన్ని రంగాల్లో వేగంగా దూసుకుపోతోందని, ఏఐతో అనేక ఉపయోగాలు ఉన్నాయని వక్తలు అభిప్రాయపడ్డారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో ఏఐపై రెండ్రోజుల జాతీయ సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా కరీంనగర్ లైఫ్‌లైన్ ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ సీహెచ్ ప్రదీప్‌కుమార్, సదస్సు అధ్యక్షురాలు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత, ముఖ్యవక్తలు ప్రొఫెసర్ శరత్‌బాబు, తమిళనాడు ప్రొఫెసర్ డాక్టర్ పూర్ణచందర్ తదితరులు హాజరై మాట్లాడారు. భవిష్యత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు అధిక ప్రాధాన్యత ఉంటుందని విద్యా, పరిశోధనా రంగాల్లో సైతం అనేక అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని చెప్పారు. క్యాన్సర్ నివారణలో సైతం ఏఐని ఉపయోగించుకోవచ్చన్నారు. పరిశోధకులు ఏఐపై పట్టు సాధించాలని సూచించారు. విద్యార్థులు ఏఐని అందిపుచ్చుకుని భవిష్యత్‌లో రాణించాలన్నారు. అనంతరం ఐఎస్‌బీఎన్‌తో కూడిన పరిశోధనా సంకలనాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థినుల సాంస్కృతిక, నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ అయోధ్యరెడ్డి, ఏఓ సులేమాన్, పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ గోపాలసుదర్శనం, తమిళనాడు, మహరాష్ట్రల నుంచి పరిశోధకులు, తదితరులు హాజరయ్యారు.
ఏఐపై పట్టు సాధించాలి
జాతీయ సదస్సులో వక్తలు
Comments
Please login to add a commentAdd a comment