న్యాయ విచారణ జరిపించాలి
సంగారెడ్డి ఎడ్యుకేషన్: గురుకులాల్లో జరుగుతున్న కలుషిత ఆహారం, ఆత్మహత్య ఘటనలపై న్యాయవిచారణ జరిపించాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ఎదుట శుక్రవారం ఏబీవీపీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యసమితి సభ్యుడు ఆకాష్ మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదికాలంలో గురుకుల వసతి గృహాల్లో 38 సార్లు కలుషిత ఆహారం తిని వేలమంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారన్నారు. వివిధ కారణాలతో దాదాపు 48 మంది విద్యార్థులు ప్రాణాలు కూడా కోల్పోయారని ఈ ఘటనలపై వెంటనే న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ రాజు, రాష్ట్ర సోషల్ మీడియా కో–కన్వీనర్ ఉదయ్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.
గురుకులాల్లో ఆత్మహత్యలపై
విచారణకు ఏబీవీపీ డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment