బీఆర్‌ఎస్ తరహాలోనే కాంగ్రెస్ పాలన
సంగారెడ్డి ఎడ్యుకేషన్: పరిపాలనలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలవి ఒకటే తీరని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పేర్కొన్నారు. సంగారెడ్డిలోని కేవల్‌కిషన్ భవన్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరనే చట్టబద్ధం చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఏడాదిపాటు రైతులు ధర్నా చేసిన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయిందని విమర్శించారు. ఆ హామీల అమలుకోసమే పంజాబ్‌కు చెందిన రైతు నాయకుడు దలేవాల్ గత 30 రోజులు ఆమరణ నిరహార దీక్ష చేస్తున్నట్లు తెలిపారు. మహిళల చదువే లక్ష్యంగా సావిత్రీబాయి పాఠశాలలో బోధనలు చేస్తే ప్రస్తుతం బాలికలు విద్యను అభ్యసిస్తున్న కేజీబీవీలలో మహిళా ఉపాధ్యాయులను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులు చేస్తున్న ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రయత్నించడం సిగ్గు చేటన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు చుక్కా రాములు, రమణ, జయరాజు తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు
బీవీ రాఘవులు
Comments
Please login to add a commentAdd a comment