ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు
సంగారెడ్డి జోన్: ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి ఎంపీడీఓ, ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా మండలాలలో జరుగుతున్న సర్వేపై మండల అధికారులతో ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో ఎలాంటి పొరపాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. సొంత స్థలం ఉన్న అర్హులైన నిరుపేదలకు ప్రాధాన్యతాక్రమంలో ఇళ్లను మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి ప్రభుత్వం 3,500 ఇళ్లు మంజూరు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. అర్హులైన నిరుపేదలకు ఖాళీ స్థలం ఉన్న వారికి మొదటి విడతలో ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ట్రైనింగ్ కలెక్టర్ మనోజ్ తదితరులు పాల్గొన్నారు.
ఈవీఎం గోడౌన్‌ను సందర్శన
ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ క్రాంతి సందర్శించారు. సీళ్లను, సీసీటీవీలో బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్లు, ఇతర ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన తీరును పరిశీలించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల భద్రత విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
కలెక్టర్ వల్లూరు క్రాంతి
పకడ్బందీగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే
అర్జీలను సత్వరమే పరిష్కరించండి
సంగారెడ్డి జోన్: ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలను అధికారులు ప్రత్యేక శ్రద్ధతో పరిష్కరించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో అధికారులతో కలిసి ఆమె ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్, మాధురి, డీఆర్‌ఓ పద్మజరాణి, ఆర్డీఓ రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment