● కమనీయం.. రథోత్సవం
సంగారెడ్డి టౌన్: సంగారెడ్డి వైకుంఠపుర మహాలక్ష్మి గోదా సమేత విరాట్ వేంకటేశ్వర స్వామి రథోత్సవం సోమవారం కనుల పండువగా కొనసాగింది. యువ వికాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రథోత్సవంలో రామానుజ జీయర్ స్వామి, ఆలయ ప్రధాన అర్చకులు కందాడై వరదాచార్యులు ప్రత్యేక పూజలు చేసి రథాన్ని ముందుకు నడిపించారు. మహిళలు అడుగడుగునా స్వామివారికి హారతి పట్టారు. రథం ఎదుట కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యువతీ యువకులు భక్తి గీతాలకు అనుగుణంగా నృత్యం చేస్తూ ముందుకు సాగారు. డోలు వాయిద్యం, గుస్సాడీ నృత్యం భక్తులను అలరించాయి. పోతిరెడ్డిపల్లి చౌరస్తా పీఎస్‌ఆర్ గార్డెన్ నుంచి వైకుంఠపురం ఆలయం వరకు దారిపొడవునా భక్త బృందం భజనలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment