మరో 7 సహకార సంఘాలు!
సంగారెడ్డి జోన్: రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో మరిన్ని సహకార సంఘాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటుంది. నూతనంగా ఏర్పాటైన మండలాలతో పాటు మరికొన్ని గ్రామాల్లో సంఘాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కొత్త సంఘాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించాలనే ఆదేశాలు రావటంతో రైతులకు సౌలభ్యకరంగా ఉండేందుకు మరికొన్ని సంఘాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించారు. జిల్లాలో ఏడు నూతన పరపతి సంఘాలు ఏర్పాటు అయ్యే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో ప్రస్తుతం 53 ప్రాథమిక సహకార సంఘాలు ఉన్నాయి. వీటిలో 37 డీసీసీబీ బ్యాంకు పరిధిలో ఉండగా, 16 ఎస్‌బీఐ బ్యాంకు పరిధిలో ఉన్నాయి. జిల్లాలో చాలా చోట్ల సరైన విధంగా సంఘాలు లేకపోవటంతో రైతులు సేవలను పొందలేక పోతున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న సహకార సంఘాల పాలక వర్గం సభ్యుల పదవీకాలం ఫిబ్రవరిలో ముగియనుంది. కొత్త పాలక మండలి ఏర్పాటులోపే మరికొన్ని సంఘాలు ఏర్పాటు చేయనున్నారు. 2013 సంవత్సరంలో సంఘాల ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొత్తగా ఏర్పాటు చేయలేదు. సహకార సంఘాల ద్వారా రైతులు పండించిన వివిధ రకాల ధాన్యాన్ని ప్రభుత్వాలు నిర్ణయించిన మద్దతు ధరలతో కొనుగోళ్లు చేస్తుంటారు. అదే విధంగా సబ్సిడీపై విత్తనాలు, ఎరువులను సరఫరా చేస్తారు. ఈ విధంగా ప్రతి సంవత్సరం రూ.కోట్లలో లావాదేవీలు జరుగుతాయి. రైతులు పంటల సాగు కొరకు సంఘంలోని సభ్యులకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలు అందిస్తారు. అంతే కాకుండా వ్యాపారాల అభివృద్ధికి రుణాలను మంజూరు చేస్తారు. జిల్లాలో ఉన్న సంఘాల పరిధి ఎక్కువగా ఉండటంతో రైతులకు ఇబ్బందులు తప్పలేదు. కొత్తగా ఏర్పాటైన మండలాల్లో సహకార సంఘాలు లేకపోవటంతో ఆయా మండలాల్లోని రైతులు ఇతర మండలాల్లోని సంఘాలకు వెళ్తూ ఇబ్బందులు పడ్డారు.
ప్రతిపాదనలు పంపిన అధికారులు
ఇప్పటికే 53 సంఘాలు
ఫిబ్రవరితో ముగియనున్న
పాలక వర్గం పదవీకాలం
నూతన సంఘాలకు పంపిన ప్రతిపాదనలు
మండలం ఏర్పడే సంఘం
నాగల్‌గిద్ద నాగల్‌గిద్ద
కంగ్టి తడ్కల్
నిజాంపేట నిజాంపేట
జహీరాబాద్ జహీరాబాద్
హత్నూర వడ్డెపల్లి
మునిపల్లి మునిపల్లి
సదాశివపేట ఆత్మకూరు
Comments
Please login to add a commentAdd a comment