లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత | - | Sakshi
Sakshi News home page

లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత

Published Tue, Jan 7 2025 7:21 AM | Last Updated on Tue, Jan 7 2025 7:21 AM

లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత

లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత

పటాన్‌చెరు: నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయాలన్న సమున్నత లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి అన్నారు. సోమవారం పటాన్‌చెరు డివిజన్‌ పరిధిలోని బ్లాక్‌ ఆఫీసు ప్రాంగణంలో నిర్మించనున్న ఇందిరమ్మ ఇళ్ల పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారదర్శకతతో జరుగుతుందని చెప్పారు. సొంత స్థలం కలిగి ఉన్న నిరుపేదలకు ఇల్లు నిర్మించుకునేందుకు రూ. 5లక్షల సహాయం అందించనున్నట్లు తెలిపారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల ఇంటింటి సర్వే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. మూడు విడతల్లో లబ్ధిదారుడికి నిధులు మంజూరు అవుతాయని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో హౌసింగ్‌ పీడీ చలపతిరావు, ఎంపీడీవో యాదగిరి, డీఈ రవీందర్‌, ఏఈ సత్యనారాయణ, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్‌, విజిలెన్స్‌ కమిటీ సభ్యులు చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి

ఇందిరమ్మ ఇళ్ల పనులకు శంకుస్థాపన

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement